Sunday, September 27, 2015

500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై: ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా కల త్వరలో


అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో మోడీ మాట్లాడారు. డిజిటల్ ఇండియా కలను త్వరలోనే సాకారం చేస్తామన్నారు. అందులో భాగంగా దేశంలోని 500 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉచిత వైఫై స్పాట్స్ ను పెంచుతామన్నారు. గూగుల్ సాయం తీసుకుంటాం.
ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సాయంతో 6 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ‘‘దేశంలోని అన్ని స్కూళ్ళు, పాఠశాలలకు వైఫై సౌకర్యం కల్పిస్తాం. హై వైలన్నీ ఇంటర్నెట్ వేలుగా మారతాయి’’అన్నారు మోడీ.
దేశంలో పేపర్ వినియోగం పూర్తిగా తగ్గిస్తాం. పేపర్ కొనుగోలు ఖర్చు తగ్గాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. డిజిటల్ ఇండియా సాకారం ఎంతో దూరంలో లేదన్నారు మోడీ.
మోడీతో పాటు విందులో పాల్గొన్నారు అడోబ్ సీఈవో శంతాను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, క్వాల్ కాం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాల్ జాకబ్స్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment