Sunday, September 13, 2015

చైనా ఆర్మీ నిఘా టవర్ను కూల్చిన భారత సైన్యం మారని డ్రాగన్ దాదాగిరి

లడఖ్లో నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాలు ఎదురెదురుపడి ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో సమావేశమయ్యారు. చైనా దాదాగిరిపై చర్చించారు. రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉన్న పెట్రోలింగ్ లైన్పై టవర్ నిర్మించేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యత్నించినప్పుడు ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. అయినా కూడా లెక్క చేయకుండా చైనా ఆర్మీ నిఘా టవర్ను ఏర్పాటు చేసింది. డ్రాగన్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులతో కలిసి వెళ్లి చైనా ఏర్పాటు చేసిన టవర్ను కూల్చేసింది. వాస్తవానికి పెట్రోలింగ్ లైన్పై రెండు దేశాలూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అయినా కూడా చైనా ఆర్మీ నిబంధనలు పాటించకుండా భారత్ను ఇరుకున పెట్టేందుకు టవర్ నిర్మించింది. టవర్ను కూల్చి తాము బెదిరిపోబోమంటూ ఇండియన్ ఆర్మీ గట్టి సమాధానమిచ్చింది. దీంతో ఒక్కసారిగా నియంత్రణ రేఖ వద్ద చైనా అదనపు బలగాలను రప్పించింది. భారత్కూడా సైన్యాన్ని తరలించింది. రెండు దేశాల బలగాలు ముఖాముఖి ఎదురుపడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజా పరిస్థితిపై రాజ్నాథ్ పారికర్తో చర్చించారు. చైనా ప్రతిస్పందనను బట్టి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది.

No comments:

Post a Comment