Monday, September 21, 2015

చర్మం తాజాగా, మృదువుగా బియ్యం కడిగిన నీటిని సౌందర్యాన్ని అందిస్తాయి.


1) బియ్యం నీటిని కురులకు, కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్‌ మీ సొంతం అవుతుంది.
 ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే మరింత ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కురులు బలంగా తయారవుతాయి.
2)చర్మంపై రాషెస్‌ ఉన్న చోట ఈ నీటితో కడగడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని 
వాష్‌ చేసుకుంటే ముఖంపై మరకలు తగ్గుతాయి. అంతేకాదు బియ్యం నీటిలో ఓ నూలు వసా్త్రన్ని ఉంచి.. దానితో ముఖాన్ని రుద్దుకుంటే మీ ముఖం నిగనిగలాడుతుంది
3)  కాటన్‌ బాల్స్‌తో బియ్యం కడిగిన నీటిని అద్దుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా తయారవుతుంది.
4)హెయిర్‌ కండీషనర్‌గా ఈ నీళ్లు పనిచేస్తాయి. రైస్‌వాటర్‌కు కాసింత ఎసెన్షియల్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో హెడ్‌బాత్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.




No comments:

Post a Comment