Friday, September 18, 2015

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మృతిపై నెలకొన్న మిస్టరీ



  1. Born: January 23, 1897, Cuttack
    Died: August 18, 1945, Taihoku Prefecture
    Spouse: Emilie Schenkl (m. 1937–1945)
    Children: Anita Bose Pfaff
    Parents: Prabhavati Devi, Janakinath Bose
    Education: Scottish Church College (1918)

నేతాజీ కోల్‌కతాలోనే జన్మించి అక్కడి నుంచే తన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. మమత ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడంతో కేంద్రంతో ఆమె ఢీకొంటున్నట్లు కనిస్తోంది.


మరికొందరు నేతాజీ బతికే ఉన్నారంటూ వాదించారు. ఈ నేపథ్యంలో నేతాజీ మృతికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఫైళ్లలో ఉండవచ్చని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు.


గత దశాబ్దాల నుంచి మిస్టరీగా ఉన్న నేతాజీ మరణం, ఆయనకు సంబందించిన పలు విషయాలు ఈ ఫైళ్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఓ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.



నేతాజీ కుటుంబానికి ఫైళ్లను డివిడీల రూపంలో రాష్ట్ర హోంశాఖ అందించింది. 
నుంచి కోల్‌కతా మ్యూజియంలో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఆ ఫైళ్లను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఉంచింది. కాగా, వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉంచిన నేతాజీ ఫైళ్లను మమత ప్రభుత్వం బహిర్గతం చేయడంపై కేంద్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మృతిపై నెలకొన్న మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విడుదలచేసింది. మొత్తం 12,744 పేజీలతో కూడిన 64 రహస్య ఫైళ్లను శనివారం నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. నేతాజీకి సంబంధించిన ప్రతీ ఫైల్‌ను మమత ప్రభుత్వం డిజిటైలేజేషన్ చేసింది.


No comments:

Post a Comment