Sunday, September 13, 2015

గూడూరు ఆభరణాలు చోరీ పోలీస్ బాస్‌పై రైలులో దాడి ---రాష్ట్ర వార్తలు


 హైదరాబాదు పోలీస్ అకాడమిలో ఎస్‌పి క్యాడర్ మహిళా పోలీస్ అధికారిపై ఓ అగంతుడు దాడి చేసి అమె వద్ద గల బంగారు ఆభరణాలను నగదు లూటీ చేసి తాపీగా వెళ్లి పోయిన సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని మనుబోలు రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకొంది.

ఒంగోలు నుండి ప్రయాణిస్తున్న ఓ అగంతుడు మనుబోలు స్టేషన్ దాటగానే వికలాంగుల బోగీలో ఒంటరిగా ప్రయణిస్తున్న ఐపిఎస్ అధికారిపై దాడి చేసి ఆమెను చున్నీతో కట్టి పడేసి ఆమెను పిడి గుద్దులు గుద్ది అమె వద్ద నున్న బంగారు చైను

ఆ రైలు నెల్లూరుకు రాగానే అక్కడ దిగి పినాకిని ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించగా మీరు గూడూరు వెళ్లి అక్కడ నుండి పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలని చెప్పడంతో ఆమె రైలులోని చివర వికలాంగుల బోగీలో ఎక్కారు

 హైదరాబాద్ పోలీస్ అకాడమిలో ఐపిఎస్ అధికారిగా పనిచేస్తున్న ఎస్‌ఎం రత్న అనే మహిళ శుక్రవారం చెన్నైకి వెళ్లేందుకు హైదరాబాద్‌లో సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు.

 రెండు జతల కమ్మలు, ఉంగరాలు, 2వేల రూపాయల నగదును తీసుకొని గూడూరు ఔటర్‌లో సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నల్ కోసం నిలవగా రైలు దిగి పరార్ అయ్యాడు. తీవ్ర గాయాల పాలైన ఎస్పీ గూడూరుకు రైలు చేరుకొనగానే ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియ చేయడంతో వారు వెంటనే అప్రమత్తమై అమెను చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గూడూరు, సెప్టెంబర్ 12: ప్రజల మాన, ప్రాణ రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరవైన సంఘటన శనివారం సింహపురి ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన సంఘటన తేటతెల్ల తెల్లం చేసిన వైనం ఇది


నిందితుని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈమేరకు గూడూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఒక ఎస్పీ స్థాయి అధికారిణిపై దుండగుడు దాడి చేసి ఆమె వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకొని వెళ్లడంపై రైళ్లలో సామాన్యులకు భధ్రతపై ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. (చిత్రం) తీవ్రంగా గాయపడిన ఎస్పీ రత్న

విషయం తెలుసుకొన్న గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బి శ్రీనివాస్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి జరిగిన సంఘటన గురించి ఎస్పీని అడిగి తెలుసుకొని ఆమెను మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు







No comments:

Post a Comment