‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. సీనియారిటీకి రిజర్వేషన్ వర్తించదు’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో... వెనకబాటుతనం, అభ్యర్థుల లేమికి సంబంధించిన ఆధారాలను చూపించి రాష్ట్ర ప్రభుత్వాలు సీనియారిటీని కల్పించవచ్చని వివరించింది. అంతే తప్ప, సీనియారిటీ రాజ్యాంగ హక్కు కాదని, దానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇచ్చింది. తమిళనాడు హైవేస్ డిపార్ట్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్లమో జూనియర్ ఇంజనీర్ల ప్రమోషన్లలో వివాదంపై ఈ తీర్పు వెలువరించింది. డిప్లమో ఇంజనీరింగ్ చదివిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రిజర్వేషన్ల కారణంగా జనరల్ కేటగిరీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కన్నా ఎక్కువ ప్రమోషన్లు పొందుతున్నారు. అదే సమయంలో, ప్రమోషన్లతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16-4(ఏ) కల్పించిన హక్కు ప్రకారం, జనరల్ కేటగిరీ అభ్యర్థులతోపాటు తమకు సీనియారిటీ కూడా ఇవ్వాలంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అనంతరం, ట్రిబ్యునల్ తీర్పునే మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారు. కానీ, మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం డిప్లమో ఇంజనీర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 16 4(ఎ) ప్రకారం.. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నేరుగానే సీనియారిటీ వర్తిసుందని, రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఉటంకించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనరల్ కేటగిరీ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఇంజనీర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఇంజనీర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ‘‘ఆయా రాష్ట్రాల్లోని సామాజిక పరిస్థితులు, వెనకబాటుతనం, తగిన ప్రాతినిధ్యం లేదన్న అంశాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాల్లో ప్రమోషన్లకు తగిన నిబంధనలను రూపొందించే వీలును రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4ఎ) రాష్ర్టాలకు కల్పిస్తుంది. అంతేకానీ, ఆర్టికల్ 16(4ఎ) ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సీనియారిటీ హక్కును రాజ్యాంగం నేరుగా కల్పించలేదు’’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 16లో 4వ క్లాజ్‌ను చేర్చి రూల్స్‌ను రూపొందించే అధికారాన్ని రాష్ర్టాలకు పార్లమెంటు కల్పించింది. అయితే, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కల్పించడమేనంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై తీర్పు వచ్చిన తర్వాత, 1995లో 85వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆర్టికల్ 16కు 4(ఎ) క్లాజ్‌ను మళ్లీ చేర్చారు. వెనకబాటుతనం, అభ్యర్థుల లేమి కారణాలకు తగిన డాటాను రూపొందించి సీనియారిటీని కట్టబెట్టే అధికారాన్ని రాష్ర్టాలకు పార్లమెంటు కల్పించింది. అయితే, 16 (4ఎ) స్ఫూర్తిని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుగా అన్వయించింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం ధర్మాసనం 29 పేజీల సుదీర్ఘ తీర్పును ఇచ్చింది. రిక్రూట్‌మెంట్ సమయంలోనే రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారని, ఆ తర్వాత రిజర్వేషన్ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నారని చెబుతూ 16 (4ఎ) ప్రకారం సీనియారిటీ మాత్రం వర్తించదని స్పష్టం చేసింది. సీనియారిటీకి కూడా రిజర్వేషన్లను వర్తింపజేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందని సుప్రీం అభిప్రాయపడింది. రోస్టర్ విధానంలో రిజర్వేషన్ ఆధారంగా ప్రమోషన్ పొందినా, జనరల్ కేటగిరీ అభ్యర్థి మళ్లీ ఆ స్థానానికి వచ్చిన తర్వాత సీనియారిటీ జనరల్ కేటగిరీ అభ్యర్థికే వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం హైవేస్ డిపార్ట్‌మెంట్‌లో రిజర్వ్‌డ్ అభ్యర్థులకు సీనియారిటీ కల్పించడానికి చెప్పిన కారణాలు నమ్మశక్యంగా లేవని, వెనకబాటుతనం, అభ్యర్థుల లేమిపై శాస్ర్తీయ పద్ధతుల్లో డేటాను రూపొందించలేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వెనకబాటుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సేకరించిన డాటా చెల్లుబాటు కాదని, శాస్ర్తీయ పద్ధతిలోనే సేకరించాలని స్పష్టం చేసింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థుల సీనియారిటీ జాబితాను సవరించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సీనియారిటీని ఇవ్వాలని ఆదేశాలను జారీ చేసింది.
VMYF is a synergy of Patriotic Youth Committed to re-establish India as the true super power.
Sunday, September 13, 2015
రిజర్వేషన్ ప్రమోషన్లకే రెండు దశాబ్దాల కేసులో సుప్రీం చరిత్రాత్మక తీర్పు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment