భారతీయులను ఉర్రూతలూగించిన ఏఆర్
రెహమాన్పై
ముస్లిం
సంస్థ
ఫత్వా
జారీ
చేయడంపై
విశ్వహిందూపరిషత్ మండిపడింది హిందూ
సమాజం
తన
కుమారుడైన
రెహమాన్
తిరిగి
రావాలని
కోరుకుంటోందని, ఇలాంటి
ఫత్వాల
బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేకుండా
హిందూ
ధర్మంలోకి
తిరిగివచ్చెయ్యమని విశ్వహిందూ పరిషత్
సంయుక్త
జాతీయ
కార్యదర్శి సురేంద్ర జైన్ రెహమాన్కు
పిలుపునిచ్చారు. ఆయనకిదే
ఆహ్వానమన్నారు. ఒకసారి హిందూ ధర్మంలోకి
తిరిగి
వచ్చాక
ఎలాంటి
ఫత్వాలూ
ఏమీ
చేయలేవని
సురేంద్ర
జైన్
చెప్పారు.
తెలిసో
తెలియకో
హిందూ
ధర్మం
నుంచి
ఇతర
మతాల్లోకి
వెళ్లిన
వారంతా
తిరిగి
వచ్చేసేందుకు విశ్వహిందూ పరిషత్ ఘర్
వాపసీ
కార్యక్రమం నిర్వహిస్తోంది.
మహ్మద్ మెస్సేంజర్ ఆఫ్ గాడ్ అనే ఇరానీ సినిమాకు సంగీతం అందించినందుకు రెహమాన్పై ముంబైకి చెందిన రజా అకాడెమీ అనే ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం సినిమాపై ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేసింది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది ఇప్పటికే హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేశారు
No comments:
Post a Comment